ఇంజిన్‌లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ : ఇద్దరికి స్వల్ప గాయాలు

الثلاثاء، 10 فبراير 2026

Gainesville Georgia north of Atlanta Plane makes emergency landing on road after engine failure single-engine Hawker Beechcraft BE-36 aircraft Two injured USA

t f B! P L


మెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా నగరానికి ఉత్తరాన ఉన్న గైనెస్‌విల్లేలో 'హాకర్ బీచ్‌క్రాఫ్ట్ BE-36' అనే సింగిల్ ఇంజిన్ విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా ఇంజిన్‌లో టెక్నికల్ సమస్య తలెత్తింది. విమానం అదుపు తప్పుతుండటంతో పైలట్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని రద్దీగా ఉండే రహదారిని రన్‌వేగా భావించి విమానాన్ని దించేందుకు ప్రయత్నించారు. విమానం రోడ్డుపైకి దూసుకొస్తున్న క్రమంలో అక్కడ ప్రయాణిస్తున్న మూడు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ అనూహ్య ఘటనతో ఒక్కసారిగా స్థానికులు షాక్‌కు గురయ్యారు. విమానం రెక్కలు, ముందు భాగం కార్లను తాకడంతో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనలో ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గోల్డెన్ కోరల్ ప్రాంతంలోని రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి విమానాన్ని రోడ్డుపై నుంచి తొలగించే చర్యలు చేపట్టారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఇంజిన్ వైఫల్యానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషిస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ