ఒరాకిల్ మలివిడత లేఆఫ్స్ లో 30,000 మందిపై వేటు ?

الاثنين، 2 فبراير 2026

000 employees in the second round of layoffs? company had also laid off 10 percent of its employees last year Oracle to lay off 30 science technology

t f B! P L


రాకిల్ మలివిడత లేఆఫ్స్ పై దృష్టి సారించింది. ఏకంగా 30,000 మందిని తొలగించడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది కూడా 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిందీ సంస్థ. భారత్ లో పని చేస్తోన్న వారిని సాగనంపింది. అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ అధికారికంగా ప్రకటించింది. ఒరాకిల్‌కు ఎప్పటినుంచో వ్యూహాత్మకంగా మానవ వనరుగా ఉంటోంది.. భారత్. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో వేలాదిమంది ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. గత ఏడాది సుమారు 10 శాతం మందిని తొలగించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిపై వేటు వేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల విస్తరణ కోసం ఆర్థిక సహాయ సమస్యలను ఎదుర్కొంటోంది ఒరాకిల్. అమెరికాలో డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన ఫండింగ్ చేయడానికి బ్యాంకులేవీ కూడా ముందుకు రావట్లేదు. దీంతో- ఖర్చును తగ్గించుకోవాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమౌతోంది. సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సీఐఓ వెల్లడించింది. ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ ను తన కథనానికి ఉటంకించింది సీఐఓ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ విస్తరణ కోసం అవసరమైన రుణాలను అందజేయడంలో అమెరికా బ్యాంకులు వెనక్కి తగ్గాయని, దీంతో ఒరాకిల్ లేఆఫ్స్ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఈ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో కంపెనీ కొన్ని కార్యకలాపాలను విక్రయించే ఆలోచనలో కూడా ఉంది. డేటా సెంటర్ల విస్తరణకు దిగిన ఒరాకిల్ కు నిధుల సమస్యలు తీవ్రంగా మారాయని పేర్కొంది. డేటా సెంటర్ల నిర్మాణం కోసం నిధులు సమకూర్చగల ఒరాకిల్ సామర్థ్యంపై ఈక్విటీ, రుణ పెట్టుబడిదారులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని టీడీ కోవెన్ తన నివేదికలో పేర్కొన్నట్లు సీఐఓ వెల్లడించింది. లేఆఫ్స్ వల్ల ఎనిమిది బిలియన్ల నుండి 10 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది ఒరాకిల్ కు. కోవెన్ అంచనా ప్రకారం- డేటా సెంటర్ల విస్తరణకు 156 బిలియన్ల మూలధన వ్యయం అవసరం. సామ్ ఆల్ట్‌మన్ కు చెందిన ఓపెన్ ఏఐ కోసం డేటా సెంటర్లను నిర్మించే ప్రాజెక్ట్‌లను ఒరాకిల్ గతంలో చేపట్టింది. ఇది భారీ పెట్టుబడులతో కూడుకున్నది. బ్యాంకులు వెనకడుగు వేయడంతో రుణ ఖర్చులు బాగా పెరిగాయి. డేటా సెంటర్ ఫైనాన్సింగ్‌పై వడ్డీ రేటు ప్రీమియంలు సెప్టెంబర్ నుండి రెట్టింపు అయ్యాయి. ఈ అధిక ఖర్చులు అనేక డేటా సెంటర్ లీజు చర్చలను నిలిపివేశాయి. కంప్యూటింగ్ సామర్థ్యం పొందడానికి ఒరాకిల్‌కు అడ్డుపడుతున్నాయి. నిధులు లేకపోవడంతో ఒరాకిల్ క్లయింట్లకు సంబంధించిన ఏఐ ఆధారిత క్లౌడ్ సేవల డిమాండ్‌ను తీర్చలేకపోతోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ