ఐసీసీ టీ20 ప్రపంచ కప్ - 2026లో సూపర్-8కి పాకిస్తాన్ అర్హత సాధించింది. కొలంబో వేదికగా నమీబియాతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. షాహిబ్జాదా ఫర్హాన్ అజేయం శతకంతో సత్తా చాటగా ఉస్మాన్ తారిక్ (4/16) నాలుగు వికెట్లతో నమీబియా పతానాన్ని శాసించాడు. ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి భారత్‌తో పాటు పాకిస్తాన్ సూపర్-8కు అర్హత సాధించింది. మరోవైపు నమీబియా ఓటమితో ప్రపంచకప్ టోర్నీని ముగించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 3 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. షాహిబ్జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ సల్మాన్ అఘా(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), షాదాబ్ ఖాన్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 36 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో జాక్ బ్రెస్సెల్(2/48) రెండు వికెట్లు తీయగా.. గెర్హార్డ్ ఎరాస్మస్(1/25) ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లారేన్ స్టీన్‌కాంప్ (23), అలెగ్జండర్ (20) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ (4/16) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. షాదాబ్ ఖాన్ (3/19) మూడు వికెట్లు తీసాడు. సల్మాన్ మిర్జా, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ - 2026 : సూపర్-8కి అర్హత సాధించిన పాకిస్తాన్
الأربعاء، 18 فبراير 2026
cricket final league match against Namibia huge margin of 102 runs ICC T20 World Cup - 2026 Pakistan qualified for Super-8 sports
ليست هناك تعليقات:
إرسال تعليق