కొత్త 'క్రిస్టల్ పింక్' కలర్‌లో రెనో 15 ప్రో మినీ విడుదల

Sunday, February 1, 2026

120Hz refresh rate 240Hz touch sampling rate 6.32-inch 1.5K flat OLED display (2640 × 1216 pixels) fold smart phone Oppo Reno 15 Pro Mini launched in new 'Crystal Pink' color science technology

t f B! P L


దేశీయ మార్కెట్లో ఒప్పో 'క్రిస్టల్ పింక్' కలర్ వేరియంట్‌ రెనో 15 ప్రో మినీ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఈ నెల ప్రారంభంలోనే కోకో బ్రౌన్, గ్లేసియర్ వైట్ రంగుల్లో విడుదల చేసిన ఒప్పో ఇప్పుడు స్టైలిష్ క్రిస్టల్ పింక్ రంగుతో మరింత ఆకర్షణీయంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 6.32 అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లే (2640 × 1216 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్, గరిష్టంగా 3600 నిట్స్ బ్రైట్‌నెస్, 3840Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, ఒప్పో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. దీనిలో 4nm టెక్నాలజీపై ఆధారిత MediaTek Dimensity 8450 ఆక్టా-కోర్ ప్రాసెసర్. (గరిష్టంగా 3.25GHz), Mali-G720 MC7 GPU, 12GB LPDDR5X ర్యామ్, 256GB / 512GB UFS 3.1 స్టోరేజ్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16. 200MP మెయిన్ కెమెరా (OIS, f/1.8), 50MP అల్ట్రా వైడ్ కెమెరా (112° FOV), 50MP 3.5X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (OIS), 4K 60fps వీడియో రికార్డింగ్. 50MP సెల్ఫీ కెమెరా, 4K 60fps వీడియో సపోర్ట్ వుంది. ఒప్పో రెనో15 ప్రో మినీ కొత్త క్రిస్టల్ పింక్ వేరియంట్ ఫిబ్రవరి 1, 2026 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, OPPO ఈ-స్టోర్, అలాగే ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ల కోసం ఒప్పో ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, యూపీఐ ద్వారా 10% వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది. 15 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ EMI ఆప్షన్, ఇంకా రూ.2,000 ఎక్స్చేంజ్ బోనస్, 180 రోజుల ఫ్రీ స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ప్రతి కొనుగోలుపై ఒప్పో ఇంకో బడ్స్ 3 Pro+పై 50% డిస్కౌంట్ వస్తుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ