కెనడాలోని బ్రిటీష్ కొలంబియా, టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లో ఓ మహిళ కంటికి కనిపించిన వారందరిపై విచక్షణా రహితంగా కాల్పులు జరపగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ మృతుల్లోనే నిందితురాలు కూడా ఉందని, కాల్పుల జరిపిన అనంతరం ఆమె తనను తానే కాల్చుకుని ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెబుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లోకి తుపాకీతో ప్రవేశించిన ఓ మహిళ ఒక్కసారిగా కాల్పులు మొదలు పెట్టింది. కంటికి కనిపించిన వారందరిపై కాల్పులు జరపగా నిమిషాల వ్యవధిలోనే పాఠశాల ప్రాంగణం మొత్తం ఆర్తనాదాలతో నిండిపోయింది. ఆ సమయంలో స్కూల్లో సుమారు 175 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే కాల్పుల శబ్దం వినగానే విద్యార్థులు ప్రాణభయంతో తరగతి గదుల్లోని అల్మారాల్లో, బల్లలు, బెంచీల కింద దాక్కున్నారు. కానీ బయటే ఉన్న వారు మాత్రం ఆమె నుంచి తప్పించుకోలేకపోయారు. మరోవైపు పాఠశాల సిబ్బంది అప్పటికే పోలీసులకు సమాచారం అందించగా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ బలగాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులు అందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించాయి. మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించాయి. ఈ కాల్పుల ఘటనలో పాఠశాలలోనే ఆరుగురు మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు విడిచారని పోలీసులు చెప్పారు. విచారణలో భాగంగా పట్టణంలోని ఓ నివాసంలో మరో ఇద్దరు మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. నిందితురాలిని బ్రౌన్ కలర్ జుట్టు ఉన్న మహిళగా గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపిన అనంతరం తనను తాను కాల్చుకుని పాఠశాల ప్రాంగణంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. గాయపడిన 25 మందిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వారిని హెలికాప్టర్ ద్వారా ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి విద్యార్థులను రక్షించిన పోలీసులకు, సహాయక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రిటీష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఏబీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 2020లో నోవా స్కోటియాలో జరిగిన కాల్పుల తర్వాత కెనడాలో జరిగిన అత్యంత భీకరమైన దాడి ఇదే కావడం గమనార్హం.
కెనడాలోని సెకండరీ స్కూల్‌లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన మహిళ : 10 మందిదుర్మరణం, 25 మంది తీవ్ర గాయాలు
الأربعاء، 11 فبراير 2026
10 dead 25 seriously injured international Tumbler Ridge Secondary School in British Columbia Woman opens fire indiscriminately at secondary school in Canada
ليست هناك تعليقات:
إرسال تعليق