అమెరికాలోని ఇల్లినాయిస్ లో మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. వ్యాపార లావాదేవీలను స్తంభింపజేసింది. ఈ విషయాన్ని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అధికారికంగా వెల్లడించింది. ఇలినాయిస్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్ ఈ బ్యాంక్ ను మూసివేసినట్లు తెలిపింది. ఈ ఏడాది అమెరికాలో కుప్పకూలిన తొలి బ్యాంక్ ఇదే. మెట్రోపాలిటన్ డిపాజిట్లన్నింటినీ స్వీకరించడానికి ఎఫ్‌డీఐసీ ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించింది. ఫస్ట్ ఇండిపెండెన్స్ బ్యాంక్‌తో కొనుగోలు, అప్పగింత ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ మూతపడినందున తక్షణమే ప్రత్యామ్నాయాన్ని అన్వేషించామని, ఫలితంగా డిపాజిటర్లు, కస్టమర్లకు అందే సేవల్లో ఎలాంటి అవాంతరాలు ఉండబోవని ఎఫ్‌డీఐసీ వివరించింది. ఇదే విషయాన్ని అటు ఇలినాయిస్ రెగ్యులేటర్ కూడా నిర్ధారించింది. డిపాజిట్లకు పూర్తి రక్షణను కల్పించినట్లు తెలిపింది. మూసివేత సమయంలో మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంక్ లో సుమారు 261.1 మిలియన్ల డాలర్ల ఆస్తులు ఉన్నాయి. అందులోనివి మెజారిటీ నిరర్థక ఆస్తులే. అలాగే, మూలధన ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండటం దివాళా తీయడానికి కారణమైందని రెగ్యులేటర్ స్పష్టం చేసింది. దీని వల్ల డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్‌కు సుమారు 19.7 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఎఫ్‌డీఐసీ ప్రాథమికంగా అంచనా వేసింది.
అమెరికాలో దివాళా తీసిన మెట్రోపాలిటన్ క్యాపిటల్ బ్యాంక్ అండ్ ట్రస్ట్
السبت، 31 يناير 2026
Illinois state international Metropolitan Capital Bank and Trust goes bankrupt in the US officially announced by the Federal Deposit Insurance Corporation
ليست هناك تعليقات:
إرسال تعليق