టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీ శిక్షణ తరగతులు : సామాన్య కార్యకర్తలా పాఠాలు విన్న చంద్రబాబు నాయుడు

الثلاثاء، 27 يناير 2026

Andhra Pradesh Chandrababu Naidu Attends Classes Like an Ordinary Party Worker Parliamentary Committee Training Classes at TDP Central Office

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంట్ కమిటీల శిక్షణ తరగతుల్లో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. చంద్రబాబు నాయుడు ఒక సామాన్య కార్యకర్తలా చివరి బెంచీలో కూర్చుని పాఠాలు వినడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శిక్షకులు చెబుతున్న అంశాలను ఆయన ఎంతో ఏకాగ్రతతో గమనిస్తూ, నోట్స్ రాసుకోవడం చూసి పార్టీ శ్రేణులే కాకుండా నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా, పార్టీ నేతలకు ఇస్తున్న శిక్షణ ఏ విధంగా సాగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకే ఆయన వెనుక బెంచీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో లోకేష్ కూడా ఇదే తరహాలో వెనుక కూర్చుని తరగతులు విన్న ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు తండ్రీకొడుకులు ఇద్దరూ నిత్య విద్యార్థుల్లా క్రమశిక్షణతో వ్యవహరించడం వారి నిబద్ధకు సాక్ష్యమని టీడీపీ నేతలు అంటున్నారు. నాయకుడు అంటే ముందుండి నడిపించడమే కాదు, కార్యకర్తలతో కలిసి నేర్చుకోవడం కూడా అంటూ టీడీపీ మద్దతుదారులు ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి వర్క్‌షాప్‌లలో అధినేతలు వేదికపై కూర్చుని ప్రసంగించి వెళ్లిపోతుంటారు. కానీ, చంద్రబాబు వెనుక వరుసలో కూర్చుని శిక్షణను పర్యవేక్షించడం ద్వారా కొత్త తరం నేతలకు ఒక బలమైన సంకేతం పంపారు. నేర్చుకునే విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదని..చంద్రబాబు చెబుతూత ఉంటారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆయనలో ఉన్న ఆ నేర్చుకునే తపన, పని పట్ల ఉన్న నిబద్ధత యువ నాయకులకు స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ