ఆంధ్రప్రదేశ్ లోని రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల వీడియో బయటకు వచ్చింది. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను విడుదల చేసింది. వీడియోపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 'ఫేస్‌బుక్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మహిళా ఉద్యోగిణిపై ఎమ్మెల్యే వేధింపులు మొదలు పెట్టారు. తల్లిదండ్రులు లేని మహిళా ఉద్యోగినిని భయపెట్టి లోబర్చుకున్నారు. కోరిక తీర్చకుంటే మూడేళ్ల కొడుకును చంపేస్తా అని బెదిరించసాగారు. తాను ఎమ్మెల్యేను ఏమైనా చేయగలనని మహిళపై వేధించి ఏడాదిన్నర పాటుగా అత్యాచారానికి పాల్పడ్డారు. మొదట్లో పెళ్లి చేసుకుంటా అంటూ మహిళకు మాయమాటలు చెప్పారు. కొన్నాళ్ల తర్వాత భర్తకు విడాకులు ఇవ్వాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. వినకపోవడంతో ఏకంగా ఆమె భర్తకే ఫోన్ చేసి వదిలేయాలని బెదిరింపులు చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల సదరు ఉద్యోగిణి గర్భవతి అయింది. విషయం తెలిసి మహిళకు ఎమ్మెల్యే బెదిరించి అబార్షన్ చేయించారు. ఇది కూటమి ప్రభుత్వ పనితీరు. వీళ్లా మహిళలను రక్షించేది' అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
మహిళా ఉద్యోగినిని భయపెట్టి లోబర్చుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ?
الثلاثاء، 27 يناير 2026
Andhra Pradesh Did MLA Arava Sridhar intimidate and exploit a female employee? Railway Kodur constituency YSR Congress Party released the video on social media
ليست هناك تعليقات:
إرسال تعليق