డంపింగ్ మిషన్‍లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి

السبت، 24 يناير 2026

at the Yousufguda dumping yard crime GHMC worker dies after falling into a dumping machine hyderabad removing garbage in the morning telangana

t f B! P L


హైదరాబాద్ లో చెత్త డంపింగ్ యార్డ్ లో చెత్త తొలగించే మిషన్ లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు యూసఫ్ గూడ డంపింగ్ యార్డ్ వద్ద జరిగింది. ఉదయం చెత్త తొలగించే క్రమంలో లారీ డోర్ విఫలమైంది. ఇంతలో అతడి కాలు జారి చెత్తను తొలగించే మిషన్ అతడిని తనలోపలికి లాగేసుకుంది. తోటి కార్మికులు ఇది గ్రహించి బయటకు తీసేలోపు అతడు చనిపోయాడు. మృతుడిది ఆంధ్రప్రదేశ్‍లోని కర్నూల్ జిల్లా దుగ్గలి మండలం పగిడిరాయి వాసిగా గుర్తించారు. అయితే రాంకీ సంస్థ నిర్లక్ష్యం వల్లే కార్మికుడు చనిపోయారని యూసఫ్ గూడ డంపింగ్ యార్డ్ వద్ద విధులు బహిష్కరించి జీహెచ్ఎంసీ స్వచ్ఛ కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం న్యాయం చేసే వరుక ఆందోళన విరమించేది లేదని నిరసన వ్యక్తం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ