బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి భవనానికి నిప్పు పెట్టిన దుండగులు

السبت، 24 يناير 2026

has caused a major stir locally. Miscreants set fire to Gali Janardhan Reddy's building in Ballari national This incident which took place in the Ballari Cantonment area

t f B! P L


ర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓ విలాసవంతమైన భవనాన్ని దుండగులు తగలబెట్టారు. బళ్లారి కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బళ్లారి నగరంలోని 'జీ స్క్వేర్ లేఅవుట్'లో సుమారు రూ. 3 కోట్ల విలువైన ఈ మోడల్ హౌస్‌పై దుండగులు పెట్రోల్, డీజిల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుల పనేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 1వ తేదీన జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే, ఇప్పుడు ఏకంగా భవనాన్ని తగలబెట్టడం రాజకీయ కక్ష సాధింపేనని సోమశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం బెంగళూరులో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల బ్యానర్ల వివాదం తలెత్తిన నేపథ్యంలోనే ఈ అగ్నిప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. "బళ్లారి ఎస్పీతో మాట్లాడాను, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరాను" అని ఆయన మీడియాకు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ