మార్చి 1న బార్సిలోనాలో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2026 వేదికగా హానర్ మ్యాజిక్ వీ6, రోబోట్ ఫోన్ అనే రెండు ఫోన్లను కంపెనీ విడుదల చేయనుంది. ఏఐ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే సరికొత్త చాప్టర్ మొదలుపెట్టబోతున్న ఈ మెగా ఈవెంట్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు లైవ్ స్ట్రీమ్ కానుంది. ఈ రోబోట్ ఫోన్ గురించి 2025 అక్టోబర్‌లోనే హానర్ చిన్న క్లూ ఇచ్చి, ఇప్పుడు దీనిని అధికారికంగా లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే దీనిపై ఒక గింబాల్‌పై అమర్చిన పాప్ అవుట్ ఏఐ కెమెరా ఉంటుంది. ఇది రొటేటింగ్ మోటార్ సాయంతో తనకు తానుగా కదులుతూ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గమనిస్తుంది. హానర్ రోబోట్ ఫోన్‌లోని కెమెరా కేవలం ఫోటోలు తీయడానికే కాదు, మన రోజువారీ పనుల్లో సాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు దానికి ఏ షూస్సె ట్ అవుతాయో ఇది సలహా ఇస్తుంది. అలాగే ఇంట్లోని పెంపుడు జంతువులను గుర్తించడం నుంచి ఏదైనా వస్తువుల గురించి అడిగే ప్రశ్నలకు స్పాట్‌లోనే సమాధానాలు చెప్పడం వరకు ఏఐ అసిస్టెంట్ పనిచేస్తుంది. రోబోట్ ఫోన్‌తో పాటు హానర్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ ఫోన్ మ్యాజిక్ వీ6ను కూడా రంగంలోకి దించుతోంది. ఈ ఫోన్‌లో సరికొత్త 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను అమర్చుతున్నట్లు టెక్ నిపుణుల అంచనా. ఇక ఫొటోగ్రఫీ లవర్స్ కోసం 200MP మెయిన్ కెమెరాతో పాటు 3x ఆప్టికల్ జూమ్ ఇచ్చే పెరిస్కోప్ లెన్స్‌ను కూడా అమర్చారు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్‌లో ఉంటుందని సమాచారం. సాధారణంగా మడతపెట్టే ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోతుందనే కంప్లైంట్స్ ఉంటాయి. కానీ ఈ మ్యాజిక్ వీ6లో మాత్రం ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం దీనిలో 7,150mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇంత శక్తివంతమైన బ్యాటరీ ఒక ఫోల్డబుల్ ఫోన్‌లో రావడం నిజంగా విశేషమే.
ホーム
/
technology
/
మ్యాజిక్ వీ6, రోబోట్ ఫోన్ లను విడుదల చేయనున్న హానర్ !
السبت، 24 يناير 2026
Honor to launch Magic V6 and Robot Phone Mobile World Congress 2026 in Barcelona on March 1st science smart phone technology
ليست هناك تعليقات:
إرسال تعليق