భారత్‌పై 25 శాతం టారిఫ్‌ తగ్గించనున్న అమెరికా ?

السبت، 24 يناير 2026

business international national US Treasury Secretary Scott Bessent stated Will the US reduce the 25 percent tariff on India?

t f B! P L


మెరికా అధ్యక్షుడు భారత్‌పై మొదట 25 శాతం టారిఫ్‌ వేసి, రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలును సాకుగా చూపి మరో 25 శాతం టారిఫ్‌ విధించారు. అయితే తాజాగా భారత్‌ రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి తగ్గిస్తున్న నేపథ్యంలో 25 శాతం టారిఫ్‌ కూడా ఎత్తివేయాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ మాట్లాడుతూ 'భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గించడం స్వాగతిస్తున్నామన్నారు. ప్రస్తుత సుంకాలను తొలగించే మార్గాలు ఆలోచిస్తున్నాం' అని పేర్కొన్నాడు. అమెరికా భారత్‌పై సుంకాలు విధించడానికి రష్యా నుంచి క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులను కారణంగా చెప్పింది. ఇది భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు 50% వరకు పెరగడానికి కారణమైంది. భారత్‌ ఈ ఆరోపణలను తగ్గించడంతో అమెరికా సానుకూలంగా స్పందించింది. ఈ మార్పు భారత్‌ ఆర్థిక వ్యూహాల స్పష్టతకు ఫలితం. ఇది రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. సుంకాలు తగ్గితే భారత ఉత్పత్తులు (టెక్స్‌టైల్స్, ఫార్మా, ఐఖీ సేవలు) అమెరికా మార్కెట్‌లో పోటీ పడతాయి. ఇది ఎగుమతి ఆదాయాన్ని పెంచి, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అమెరికా-భారత వాణిజ్య ఒప్పంద చర్చలకు ఇది బలపడే అడుగు. భారత్‌ ఇతర ఈయూ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ మార్పు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తాజా పరిణామాలు ట్రంప్‌లో భయాన్ని సూచిస్తున్నాయి. భారత్‌ ఈయూ వాణిజ్య ఒప్పందం జరగకుండా ఉండేందుకే ట్రంప్‌ టారిఫ్‌ల ఎత్తివేత డ్రామా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యాను సాకుగా చూపి సుంకాలు విధించారు. ఇప్పుడు ఈయూ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో టారిఫ్‌లు ఎత్తివేయాలని భావిస్తున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ