మానవత్వంపై నమ్మకం ఉంటే మదురో ను ఎత్తుకెళ్లినట్లు నెతన్యాహు అమెరికా కిడ్నాప్ చేయాలి !

السبت، 10 يناير 2026

America should kidnap Netanyahu just like they kidnapped Maduro If there is any belief in humanity international Pakistan's Defence Minister Khawaja Asif

t f B! P L


జ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అంతర్జాతీయ స్థాయి క్రిమినల్ గా అని, ఆయనను మించిన క్రిమినల్ మరొకరు లేరని, మానవత్వానికి అతిపెద్ద నేరస్థుడని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. మానవత్వంపై నమ్మకం ఉంటే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎత్తుకెళ్లినట్టే నెతన్యాహును అమెరికా కిడ్నాప్ చేయాలని ఆయన డొనాల్డ్ ట్రంప్ కు సవాల్ విసిరారు. నెతన్యాహును అపహరించుకుని తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు టర్కీకి కూడా ఉన్నాయని అన్నారు. ఇటువంటి సందర్భం కోసం పాకిస్తానీలు రోజూ ప్రార్థనలు చేస్తోన్నారని ఆసిఫ్ అన్నారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడారు. గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సాగించిన దాడుల గురించి ప్రస్తావించారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన క్రూరత్వాలు చరిత్రలో మరే ఘోరానికీ సాటిరాబోవని స్పష్టం చేశారు. గాజా సుదీర్ఘ చరిత్రలో పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ చేసిన అన్యాయం ఏ సమాజమూ చేయలేదని వ్యాఖ్యానించారు. నెతన్యాహు మానవత్వానికి అతిపెద్ద నేరస్తుడని, ప్రపంచం ఇంతకంటే పెద్ద క్రిమినల్ ను చూడలేదని అన్నారు. నేరస్తులకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని ఖవాజా ఆసిఫ్ పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఆ న్యూస్ ఛానల్ యాంకర్ హమీద్ మీర్ కల్పించుకున్నారు. ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన పరోక్ష సూచనగా కనిపించే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ట్రంప్ ను ఉద్దేశించినవి కాదని ఓ వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ