వెనిజులా -భారత్ చమురు వాణిజ్యం పాక్షికంగా పునఃప్రారంభమయ్యే అవకాశాలు !

السبت، 10 يناير 2026

business international national US Energy Secretary Christopher Wright Venezuela was one of the largest suppliers of oil to India Venezuela-India oil trade likely to partially resume

t f B! P L


మెరికా విధించిన ఆంక్షల కారణంగా నిలిచిపోయిన వెనిజులా -భారత్ చమురు వాణిజ్యం పాక్షికంగా పునఃప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా వెనిజులా క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను అనుమతిస్తారా ? అనే ప్రశ్నకు అమెరికా అధికారి స్పష్టంగా 'అవును' అని సమాధానమిచ్చారు. అయితే ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని తెలిపారు. అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్టోఫర్ రైట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వెనిజులా చమురును అమెరికా ప్రభుత్వం మార్కెట్ చేసి, ఆర్థిక లావాదేవీలను కూడా తమ నియంత్రణలోనే నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ విధానం కింద వెనిజులా చమురు అమెరికా ఆధ్వర్యంలోనే ఇతర దేశాలకు సరఫరా అవుతుందని చెప్పారు. అమెరికా ఆంక్షలు అమల్లోకి రావడానికి ముందు భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారులలో వెనిజులా ఒకటి. ముఖ్యంగా భారీ క్రూడ్ ఆయిల్‌ను భారత రిఫైనరీలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేవి. తాజా నిర్ణయంతో భారత్ తన ఇంధన దిగుమతులను విస్తరించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక ప్రకటన చేశారు. వెనిజులా నుంచి 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికానే శుద్ధి చేసి విక్రయించనుందని తెలిపారు. వెనెజులా చమురు రంగాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా చమురు కంపెనీలు కనీసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న వెనిజులా, సంవత్సరాలపాటు ఆంక్షలు, దుర్వినియోగం, పెట్టుబడుల కొరత కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తాజా పరిణామాలతో వెనిజులా చమురు రంగంపై అమెరికా పూర్తి నియంత్రణ కొనసాగుతుందని స్పష్టమవుతోంది. అయితే, అమెరికా అనుమతిస్తే భారత్ వంటి కొన్ని దేశాలకు మాత్రమే పరిమితంగా చమురు సరఫరా జరగనుందని అధికారులు తెలిపారు.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ