అమెరికా సైన్యం జరిపిన 'ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్' వెనెజువెలాను అతలాకుతలం చేసింది. వైమానిక దాడుల్లో భాగంగా విద్యుత్ గ్రిడ్‌లు, మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యం చేసుకోవడంతో రాజధాని కరాకస్ సహా అనేక ప్రధాన నగరాలు అంధకారంలో మునిగిపోయాయి. ప్రస్తుతం అక్కడ యుద్ధం తర్వాత ఉండే భీకర పరిస్థితులు నెలకొన్నాయి. కరాకస్‌లోని మెజారిటీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆస్పత్రులు, నివాస సముదాయాల్లో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. ప్రధాన సూపర్ మార్కెట్లు మూతపడటంతో చిన్న దుకాణాల వద్ద ఆహారం కోసం ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. అత్యవసర మందుల కోసం మెడికల్ షాపుల వద్ద కిలోమీటర్ల మేర బారులు కనిపిస్తున్నాయి. కరెంటు లేకపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. ఫోన్లలో ఛార్జింగ్ లేక ప్రజలు తమ బంధువులకు సమాచారం అందించలేకపోతున్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, రోడ్లపై ఇంకా పని చేస్తున్న కొన్ని విద్యుత్ దీపాల వద్దకు చేరుకుని, ఆ వైర్ల ద్వారా ప్రజలు తమ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు.
ホーム
/
Phone charging
/
వెనెజువెలాలో స్తంభించిన జనజీవనం : ఫోన్ ఛార్జింగ్, ఆహారం కోసం హాహాకారాలు
الأحد، 4 يناير 2026
food shortages international Life in Venezuela at a standstill major cities including the capital Caracas into darknes Phone charging
ليست هناك تعليقات:
إرسال تعليق