మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా బచావో సంగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత స్థాయిలో విస్తృత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. ఈ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామీణ పేదలు, కూలీల హక్కుల పరిరక్షణకు జరుగుతున్న ఈ జాతీయ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క)కు కీలక బాధ్యతలు అప్పగించారు. అజయ్ మాకెన్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో జైరాం రమేష్, సందీప్ దీక్షిత్, డా. ఉదిత్ రాజ్, ప్రియాంక్ ఖర్గే, మంత్రి సీతక్క, దీపికా పాండే సింగ్, డాక్టర్ సునీల్ పవార్, మానిష్ శర్మ సభ్యులుగా ఉన్నారు. ఈ పథకాన్ని బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, గ్రామీణ భారతంలోని కోట్లాది కూలీల ఉపాధి హక్కులను కాపాడే లక్ష్యంతో ఈ బచావో సంగ్రామ్ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా సాగనుందని ఏఐసీసీ స్పష్టం చేసింది.
ఉపాధి హామీ పథకం పరిరక్షణకు ఏఐసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు !
الأحد، 4 يناير 2026
AICC forms coordination committee to protect the Employment Guarantee Scheme Key responsibilities assigned to Minister Seethakka national telangana
ليست هناك تعليقات:
إرسال تعليق