గ్లోబల్ మార్కెట్ లో త్వరలో శాంసంగ్ గెలాక్సీ A57 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది. అయితే శాంసంగ్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్ ఇటీవలే చైనా సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA లో కనిపించింది. దీని ఆధారంగా అనేక స్పెసిఫికేషన్ ల వివరాలు వెల్లడయ్యాయి. చైనీస్ లిస్టింగ్ ఆధారంగా గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్ Exynos 1680 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు Xclipse 550 GPU ను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB, 12GB ర్యామ్ తో 256GB స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.6 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యానిట్ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మైక్రో లెన్స్ ఉంటాయని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాతో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. చైనీస్ సర్టిఫికేషన్ సైట్ ఆధారంగా ఈ ఫోన్ 6.9mm థిక్‌నెస్, 182 గ్రాముల బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ భద్రత కోసం ఆప్టికల్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మెరుగైన ఆడియో సపోర్టు కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయని సమాచారం.
ホーム
/
technology
/
త్వరలో శాంసంగ్ గెలాక్సీ A57 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
الاثنين، 26 يناير 2026
available in 8GB and 12GB RAM variants with 256GB of storage Samsung Galaxy A57 5G smartphone to be launched soon in the global market science technology
ليست هناك تعليقات:
إرسال تعليق