పది టన్నుల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత : ఇద్దరు అరెస్టు

الاثنين، 26 يناير 2026

crime Narayana pet district SP Dr. Vineeth announced telangana Ten tonnes of fake cotton seeds seized: Two arrested

t f B! P L


తెలంగాణలోని నారాయణపేట మండలం, బండ గుండ, కొత్తపల్లి గూనీడు గ్రామాలలో జిల్లా పోలీసులు, టాస్క్ ఫోర్స్ , వ్యవసాయ శాఖ సంయుక్తంగా దాడులు చేసి పది టన్నులు పత్తి విత్తనాలను  స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. బూనీడు గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు వి బాలకృష్ణ నాయుడు, శశి వర్ధన్ నాయుడు నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేసి నారాయణపేట జిల్లాలో అక్రమంగా దండాలు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. బాలకృష్ణ నాయుడు నర్వ, మద్దూరు, దౌల్తాబాద్ మండలాలలో విక్రయాలు చేస్తూ పట్టుబడడం జరిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు కావడం జరిగింది అన్నారు. రైతులను మోసం చేసేవారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ప్యాకింగ్ లేని, అనుమానాస్పద వ్యక్తులు విక్రయాలు చేస్తూ ఉంటే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు సాగు చేస్తే మూడు మండలాలకు సరిపోయే పరిమాణంలో ఉన్నాయి అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ చెప్పారు. రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోకుండా గుర్తింపు ఉన్న ఫర్టిలైజర్ షాపులలో లాట్ నెంబర్ ఉన్న విత్తనాలు కొనుగోలు చేసి బిల్లు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాల విక్రయాలు చేసే వారి వివరాలను జిల్లా పోలీసులు, లేదా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని జాన్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ