ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

الاثنين، 26 يناير 2026

Grand Celebrations of the 77th Republic Day military parade on Kartavya Path was captivating from start to finish national President Murmu welcomed the chief guests

t f B! P L


ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవంలో దేశభక్తి అంబరాన్నంటింది. రాష్ట్రపతి జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమైన వేడుకలు కన్నుల పండువగా సాగాయి. కర్తవ్యపథ్‌పై సైనిక దళాల కవాతు ఆద్యంతం ఆకట్టుకుంది. అంతకుముందు, భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం, వేదిక వద్ద రాష్ట్రపతి ముర్ము, ముఖ్య అతిథులు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ నుంచి సంప్రదాయక బగ్గీలో ముఖ్య అతిథులతో కలిసి వచ్చిన రాష్ట్రపతి ముర్ము కర్తవ్యపథ్ వద్ద వేదికపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ ప్రారంభమైంది. త్రివిధ దళాల పరేడ్‌తో గణతంత్ర దినోత్సవ కవాతు ప్రారంభమైంది. ఈ పరేడ్‌కు లెఫ్టెనెంట్ జెనరల్ భవ్‌నీశ్ కుమార్ నేతృత్వం వహించారు. సైనిక దళాల కవాతుతో పాటు ప్రచండ్ హెలికాఫ్టర్‌ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే యూనిఫామ్‌తో అశ్వికదళం తొలిసారిగా పాల్గొనడం మరో ప్రత్యేకత. వందేమాతరం థీమ్‌తో సాగిన పరేడ్‌లో దేశ అభివృద్ధి, సాంస్కృతిక వైవిధ్యత, ఆపరేషన్ సిందూర్‌ గొప్పదనం చాటేలా పలు ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. ఇక ఐరోపాకు చెందిన నలుగురు సైనిక అధికారుల తమ జెండాలతో జిప్సీ వాహనాల్లో పరేడ్‌లో పాలు పంచుకోవడం అతిథులను ఆకట్టుకుంటుంది. ఈ వేడుకల్లో తొలిసారిగా బ్యాటిల్ ఎరే ఫార్మాట్‌లో భారత ఆర్మి కవాతును నిర్వహించింది. 61 కావల్రీ దళం, నిఘా కోసం ఉద్దేశించిన రీకానిసెన్స్ వాహనం, ఆపరేషన్ సిందూర్ జెండాతో ధ్రువ హెలికాఫ్టర్ విన్యాసం దేశసైనిక పాటవాన్ని చాటాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ