కాలిఫోర్నియాలో భూకంపం : రిక్టర్ స్కేల్ పై 5.1 గా నమోదు !

الثلاثاء، 20 يناير 2026

Earthquake in California international Recorded at 5.1 on the Richter scale tremors spread widely from Palm Springs to San Diego United States Geological Survey reported

t f B! P L


మెరికా లోని కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1 గా రికార్డయింది. ఇండీయో హిల్స్‌కు ఈశాన్యంగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఆ దేశ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 5:56 నిమిషాలకు భూకంపం సంభవించింది. ఉపరితలం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటుచేసుకున్న భారీ కదలికల వల్ల భూమి ప్రకోపించింది. ఇది షాలో ఎర్త్ క్వెక్. తక్కువ లోతులో చోటుచేసుకోవడంతో ఈ ప్రకంపనలు పామ్ స్ప్రింగ్స్ నుండి శాన్ డియాగో వరకు విస్తృతంగా విస్తరించాయి. ఈ ప్రకంపనల తీవ్రత కోచెల్లా వ్యాలీ నుండి శాన్ బెర్నార్డినో కౌంటీ వరకు కనిపించాయి. మొబైల్ యుటిలిటీలు, రోడ్లకు ఎటువంటి డ్యామేజీ సంభవించలేదని రివర్‌సైడ్ కౌంటీ అగ్నిమాపక విభాగం తెలిపింది. శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ సిస్టమ్‌కు భూకంప కేంద్రం సమీపంలో ఉండటమే దీని తీవ్రతకు కారణం. మై షేక్ వంటి యాప్‌లు దక్షిణ కాలిఫోర్నియా ప్రజలకు కొన్ని సెకన్ల ముందే హెచ్చరికలు చేరవేశాయి. ఈ జనవరిలో ఈ ప్రాంతంలో 3.3 తీవ్రత వరకు 300కు పైగా ప్రకంపనలు నమోదయ్యాయి. 2.5 నుండి 5.4 తీవ్రత కలిగిన భూకంపాలు అరుదుగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇండీయో, కోచెల్లా, లా క్వింటా నివాసితులు భూకంప కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర ప్రభావాలను చవి చూశారు. కేథడ్రల్ సిటీ, పామ్ డెజర్ట్, బిగ్ బేర్, శాన్ డియాగో, లాస్ ఏంజిల్స్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ