ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కాలంగా 22ఏ నిషేధ జాబితాలో ఉన్న భూముల విముక్తి వాటి యజమానులు వేచి చూస్తున్నారు. కాగా, ప్రభుత్వం అనేక చర్చల తరువాత ప్రభుత్వం అయిదు రకాల భూములను ఈ జాబితా నుంచి తొలగించింది. మిగిలిన భూముల విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ అయిదు రకాల భూముల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. భూయాజమానులకు ఊరటనిచ్చేలా 22ఏ జాబితా నుంచి అయిదు రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకం చేశారు. మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించనున్నారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే స్వాంత్రత్య సమర యోధుల భూములను, రాజకీయ బాధితుల కేటాయించిన భూములను కూడా 22ఏ నుండి తొలగించనున్నారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ ఒక్కటే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే విధంగా 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఎ లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా, ఎసైన్మెంట్ రిజిస్టర్లు, డీఆర్ దస్త్రాలు ఉన్నా చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదోకటి సరిపోతుందని.. 8ఏ రిజిస్టర్లు, డికెటీ పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా ఒకటే అని తెలియజేసింది. దాదాపు 8 రకాల ప్రతాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22ఏ నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంకా అదనంగా పత్రాలు కావాలని భూ యాజమానుల తిప్పుకోకూడదని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం బహుమతిగా భూయజమానులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రైతులకు, భూయాజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
22ఏ జాబితా నుంచి అయిదు రకాల భూములను తొలిగిస్తూ సంతకం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్
الخميس، 1 يناير 2026
Andhra Pradesh land owners as a New Year's gift Minister Anagani Satyaprasad signed the order removing five types of lands from the 22A list
ليست هناك تعليقات:
إرسال تعليق