తిరుమలలో రికార్డుస్థాయిలో లడ్డూ ప్రసాదం విక్రయం : 2025లో 10 శాతం అదనంగా లడ్డూలు విక్రయం

الخميس، 1 يناير 2026

10 percent more laddoos sold in 2025 Andhra Pradesh record was set on December 27th Record-breaking sale of Laddoo prasadams in Tirumala

t f B! P L


తిరుమలలో లడ్డూ ప్రసాదాలు గతేడాది రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2025లో 10 శాతం అదనంగా లడ్డూలు విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2024లో మొత్తం 12. 15 కోట్ల లడ్డూలు విక్రయిస్తే గతేడాది ఏకంగా 13.52 కోట్ల లడ్డూలను భక్తులు కొనుగోలుచేసినట్టు తెలిపింది. అంతేకాదు, గడచిన దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్‌ 27న మరో రికార్డు నెలకొల్పింది. ఆ రోజున ఏకంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేయడం గమనార్హం. ఇప్పటి వరకూ ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో లడ్డూలు అమ్ముడుకావడం ఇదే మొదటిసారి. ఏడాది నుంచి రోజుకు సగటున 4 లక్షల వరకు లడ్డూలను తయారుచేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ముఖ్యమైన ఉత్సవాలు, పండుగుల రోజుల్లో 8 నుంచి 10 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. పోటులో రెండు షిఫ్టుల్లో మొత్తం 700 మంది సిబ్బంది నియమ, నిష్టలతో శ్రీవారి ప్రసాదాలను తయారుచేస్తున్నట్లు వివరించింది. ఇటీవల లడ్డూ ప్రసాదంలో నాణ్యత, రుచి, పవిత్రతపై భక్తులకు విశ్వాసం పెరిగిందని, వారం సంతోషం వ్యక్తం చేస్తున్నారని టీటీడీ వివరించింది. నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. గతేడాది వైకుంఠ ద్వార దర్శనాలు, పండుగలు, సెలవు రోజుల్లో లడ్డూ విక్రయాలు భారీగా పెరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రసాదాలను ఎలాంటి కొరత లేకుండా భక్తులను తయారీని కూడా పెంచినట్టు అధికారులు వివరించారు. ఇక, లడ్డూ ప్రసాదాల విక్రయాలు పెరగడం టీటీడీకి ఆదాయం కూడా భారీగా వస్తున్నట్టు తెలుస్తోంది. రద్దీకి అనుగుణంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ, పంపిణీ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ ఏడాదిలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి మరింత మెరుగైన సేవలు అందజేస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ