కొలంబియాలో విమానం కూలి 15 మంది దుర్మరణం

الخميس، 29 يناير 2026

15 killed in plane crash in Colombia Aviation officials believe the accident occurred just nine minutes after takeoff including Colombian legislator Diogenes Quintero international

t f B! P L


కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వెనెజువెలా సరిహద్దులో బుధవారం రాత్రి విమానం కుప్పకూలి ఆ దేశ శాసనసభ్యుడు డియోజెనెస్ క్వింటెరో సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కొలంబియా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వ విమానయాన సంస్థ సటేనా నిర్వహిస్తున్న ఈ విమానం కుకుటాలోని విమానాశ్రయం నుంచి ఉదయం 11.42 గంటలకు (స్థానిక కాలమాన ప్రకారం) టేకాఫ్ అయ్యింది. 12.05 గంటలకు ఒకానాలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే 11.54 గంటలకు ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా వెనెజువెలా సరిహద్దులోని మారుమూల ప్రాంతమైన లా ఫ్లాయా డెబెలెన్‌లో విమానం కుప్పకూలినట్లుగా అధికారులు నిర్ధారించారు. విమానం టేకాఫ్ అయిన 9 నిమిషాలకే ప్రమాదం జరిగిందని ఏవియేషన్ అధికారులు భావిస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ