థాయిలాండ్ - కంబోడియా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంతో ప్రభావితమైన ప్రాంతంలో విష్ణువు విగ్రహాన్ని థాయ్ సైన్యం కూల్చివేయడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఇటువంటి అగౌరవ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. ఇలాంటి దాడులు మతపరమైన, సాంస్కృతిక వారసత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని అన్నారు. రెండు దేశాలు చర్చల ద్వారా శాంతి స్థాపన దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం, వారసత్వ నష్టం జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు. థాయిలాండ్-కంబోడియా సరిహద్దు వివాదం డిసెంబర్ 7న తిరిగి ప్రారంభమైంది. థాయిలాండ్-కంబోడియా సరిహద్దులో సైనిక ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే థాయిలాండ్ కంబోడియా సరిహద్దులో 9 మీటర్ల ఎత్తైన విష్ణు విగ్రహాన్ని కూల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. థాయిలాండ్ సైన్యం బుల్డోజర్‌తో విష్ణువు విగ్రహాన్ని కూల్చివేసినట్లు స్పష్టంగా ఈ వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు చూసిన ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విష్ణు విగ్రహ కూల్చివేతపై భారత్ తీవ్ర ఆందోళన
الجمعة، 26 ديسمبر 2025
India expresses deep concern over the demolition of Vishnu idol international Ministry of External Affairs spokesperson Randhir Jaiswal national
ليست هناك تعليقات:
إرسال تعليق