గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర స్కేలుపై 4.4 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. 10 కిలోమీటర్ల దూరంలో 23.65 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్, 70.23 ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్య ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వివరించింది. ఈ భూకంపం సంభవించిన వెంటనే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు వివరించారు. కచ్ జిల్లాలో తరచూ భూకంపాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే.
గుజరాత్‌లో భూకంపం : రిక్టర స్కేలుపై 4.4 గా నమోదు
الجمعة، 26 ديسمبر 2025
Earthquake in Gujarat further explained that the epicenter was located at a depth of 10 kilometers Measured 4.4 on the Richter scale national National Center for Seismology reported
ليست هناك تعليقات:
إرسال تعليق