హైదరాబాద్ లోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీ గేట్ నంబర్-4 సమీపంలో ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు ప్రయత్నించిన యువకుడు కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పారామౌంట్ కాలనీకి చెందిన ఇర్ఫాన్ (24) సోదరుడు అద్నాన్, మరో వ్యక్తి బిలాల్ మధ్య ఆదివారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఇర్ఫాన్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. తన సోదరుడు అద్నాన్, బిలాల్ మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు ఇర్ఫాన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో, ఆగ్రహంతో ఉన్న బిలాల్, ఇర్ఫాన్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్‌ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. ఈ హత్యతో పారామౌంట్ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న టోలిచౌకి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారకుడైన నిందితుడు బిలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరి మధ్య గొడవకు దారితీసిన అసలు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
టోలిచౌకిలో యువకుడి హత్య !
الاثنين، 15 ديسمبر 2025
Criem hyderabad telangana The murder caused a stir in Paramount Colony Young Man Murdered in Toli Chowki
ليست هناك تعليقات:
إرسال تعليق