ఎస్‌బీఐ కార్డ్ దేశీయ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పులు ప్రకటించింది. ఈ మార్పులు జనవరి 10 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్తగా సెట్ ఏ, సెట్ బీ అనే రెండు వర్గాలు తీసుకొచ్చింది. ముఖ్యమైన విమానాశ్రయాల్లో ఉన్న లాంజ్ జాబితా కూడా కొత్తగా మారింది. సెట్ ఏలో ప్రీమియం కార్డులు ఉంటాయి. వీటిలో అపోలో ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్, బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డ్ ఆక్టేన్, క్లబ్ విస్తారా ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్, ల్యాండ్‌మార్క్ రివార్డ్స్ ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్, పేటీఎం ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్, ఫోన్‌పే ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్ ఉన్నాయి. ఈ కార్డులు ఉన్నవారికి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూ ఢిల్లీ, పుణే విమానాశ్రయాల్లోని లౌంజ్‌లలో ప్రవేశం లభిస్తుంది. సెట్ బీలో ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్, పార్ట్‌నర్ బ్యాంక్ ప్రైమ్ వేరియంట్లు ఉంటాయి. ఇవి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ ద్వారా జారీ చేసిన కార్డులు. దీనితో పాటు క్రిస్‌ఫ్లయర్ ఎస్‌బీఐ కార్డ్, టైటన్ ఎస్‌బీఐ కార్డ్, ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్, ప్రైమ్ ప్రో కూడా ఇందులోకి వస్తాయి. సెట్ బీ కార్డు ఉన్నవారికి భువనేశ్వర్, చండీగఢ్, కొచ్చిన్, గోవా, ఇండోర్, జైపూర్, వడోదర, శ్రీనగర్, విశాఖపట్నం విమానాశ్రయాల్లో లౌంజ్ యాక్సెస్ లభిస్తుంది. మెట్రో నగరాల లౌంజ్‌లు కూడా ఇందులో ఉంటాయి. సెట్ ఏ, సెట్ బీలో ఉన్న కార్డులకు మాత్రమే కొత్త లాంజ్ ప్రయోజనాలు వర్తిస్తాయని ఎస్‌బీఐ కార్డ్ స్పష్టంగా చెప్పింది. మిగతా క్రెడిట్ కార్డులు ఇప్పటివరకు ఉన్న లాభాలతోనే కొనసాగుతాయి. లాంజ్ లోకి వెళ్లాలంటే కస్టమర్లు తమ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ను లాంజ్ పీఓఎస్ టెర్మినల్ వద్ద ధృవీకరించాలి. వీసా, రూపే వినియోగదారుల దగ్గర రీఫండ్ లేని రెండు రూపాయల వాలిడేషన్ ఫీజు వసూలు చేస్తారు. మాస్టర్‌కార్డ్ వినియోగదారుల దగ్గర తాత్కాలికంగా ఇరవై ఐదు రూపాయలు హోల్డ్‌లో ఉంచుతారు. ఆ మొత్తం సెటిల్ చేయరు. ఉచిత లాంజ్ విజిట్లు పూర్తయ్యితే ప్రవేశం ఇవ్వరు. అదనపు విజిట్ చేస్తే లాంజ్ సాధారణ రేటు వసూలు చేస్తారు. లాంజ్ నిర్వాహకులు రెండు నుంచి మూడు గంటల స్టే పరిమితి పెట్టవచ్చు. మద్యం, ప్రీమియం భోజనం, న్యాప్ రూమ్, స్పా సేవల కోసం అదనపు చార్జీలు ఉండొచ్చు. ఈ లాంజ్ ప్రోగ్రామ్‌ను వీసా, రూపే, మాస్టర్‌కార్డ్ సంస్థలే నిర్వహిస్తాయని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. వాటి నిబంధనలు వర్తిస్తాయని కూడా చెప్పింది.
ホーム
/
Set A and Set B
/
జనవరి 10 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ !
الاثنين، 15 ديسمبر 2025
have been introduced major changes to its domestic airport lounge access program national New SBI Credit Card Rules from January 10 Set A and Set B
ليست هناك تعليقات:
إرسال تعليق