ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మెగా పీటీఎం కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ తెలుగు భాషను ప్రోత్సహించేందుకు స్థానిక కలెక్టర్ కృతికా శుక్లా చేస్తున్న కృషిని గమనించారు. దీంతో అనంతరం జరిగిన సభలో పవన్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలెక్టర్ కృతిక హర్యానా నుంచి వచ్చినా ఇక్కడ మన భాష గురించి పడుతున్న తపనను పవన్ గుర్తించారు. తెలుగు భాషపై ఆమెకున్న అభిమానం, నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. కృతికా శుక్లా తెలుగు మాట్లాడుతుంటే "మీరు ఇక్కడే పుట్టారా?" అని తాను అడిగానని పవన్ తెలిపారు. "పక్క గుంటూరు-విజయవాడ ప్రాంతం వారేమో అనుకున్నాను, కానీ ఆమె 'లేదు, లేదు, మాది హర్యానా' అని చెప్పారు" అని తెలిపారు. మన మాతృభాషను నేర్చుకోవడానికి మనం ఇబ్బంది పడుతుంటే, హర్యానా నుంచి వచ్చినప్పటికీ, ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు భాష పట్ల కృతికా శుక్రా చూపిన అభిమానానికి, పిల్లలకు భాషను అర్థమయ్యేలా వివరించడానికి ఆమె పడుతున్న శ్రమకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇతర ప్రాంతాల వారికి మన మాతృభాషపై ఉన్న గౌరవంపై పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి దృష్టిని ఆకర్షించాయి.
కలెక్టర్ కృతికా శుక్లాను మెచ్చుకున్న పవన్ కళ్యాణ్
الجمعة، 5 ديسمبر 2025
Andhra Pradesh Mega PTM program Pawan Kalyan praised Collector Kritika Shukla Pawan Kalyan went to Chilakaluripet
ليست هناك تعليقات:
إرسال تعليق