మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని, తాము పోలీసులకు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని క్లారిటీ ఇస్తూ మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను ఇవాళ విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనేది అవాస్తవమని తెలిపారు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణమని మండిపడ్డారు. కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు కారకులని తెలిపారు. అక్టోబరు 27వ తేదీన చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని పేర్కొన్నారు. అనంతరం హిడ్మాను పోలీసులు పట్టుకుని ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతోనే 13 మందిని పట్టుకొని హత్య చేశారని విమర్శించారు. హత్యను కప్పిపుచ్చేందుకు మారేడుమల్లి రంపచోడవరం ఎన్‌కౌంటర్ల కట్టుకథ అల్లారని ధ్వజమెత్తారు. హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఇదని ఆరోపించారు. హిడ్మా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేర్కొన్నారు.
హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనేది అవాస్తవం : మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో లేఖ విడుదల
الجمعة، 5 ديسمبر 2025
Devji four people were responsible for Hidma's murder It is not true that Devji gave Hidma information Malla Rajireddy are with us Maoist top leader Vikalp releases letter national
ليست هناك تعليقات:
إرسال تعليق