పౌర విమానయాన సంస్థ ఇండిగో పరిణామాలపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో మాట్లాడారు. దీనికి గల కారణాలను వివరించారు. విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తోండటం, రద్దు వల్ల లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటోన్నారని అంగీకరించారు. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ఇండిగో సిబ్బంది రోస్టరింగ్, అంతర్గత ప్రణాళిక వ్యవస్థలో సమస్యల కారణంగా ఈ సంక్షోభం తలెత్తిందని, ఏవియేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ కారణం కాదని స్పష్టం చేశారు. రెగ్యులేషన్స్ కు సంబంధించి కఠినమైన పౌర విమానయాన నియమాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని, అన్ని పౌర విమానయాన సంస్థలు కూడా వీటిని తప్పకుండా పాటించాలని రామ్మోహన్ నాయుడు చెప్పారు. సాఫ్ట్‌వేర్ సమస్యపై విచారణ జరుగుతోందని, ఈ రంగంలో నిరంతరం సాంకేతికతను మెరుగుపర్చడానికి తమవంతు ప్రయత్నాలు సాగిస్తోన్నామని అన్నారు. దేశంలో విమానయాన రంగానికి అత్యున్నతమైన, ప్రపంచ స్థాయి ప్రమాణాలను తీసుకురావాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. విమానయాన రంగంలో మరింత పోటీ అవసరమని కింజరాపు స్పష్టం చేశారు. సంక్షోభానికి తలెత్తిన తొలి రోజు నుంచి ఇండిగో యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. విమానాల రద్దు వల్ల ప్రజలకు కలిగిన తీవ్ర అంతరాయంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వారికి కలిగిన అసౌకర్యానికి, అదనపు ఖర్చు భరించాల్సి రావడం పట్ల చింతిస్తున్నానని అన్నారు. విమానాల రద్దు వల్ల 5.86 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితం అయ్యారని, వారికి రూ. 5.6 కోట్లు రీఫండ్ చెల్లించినట్లు వెల్లడించారు.
విమానాల రద్దు వల్ల 5.86 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితం అయ్యారు
الاثنين، 8 ديسمبر 2025
5.86 lakh passengers affected by flight cancellations clarified that the crisis arose due to problems in IndiGo's staff rostering and internal planning system national Rammohan Naidu in Rajya Sabha
ليست هناك تعليقات:
إرسال تعليق