4300 కోట్లకు ఎయిర్ లైన్స్ అమ్మేసిన పాకిస్తాన్ ప్రభుత్వం

الأربعاء، 24 ديسمبر 2025

Arif Habib emerged Deputy Prime Minister Ishaq Dar congratulated the company on the acquisition international Pakistan government sells off national airline for 4300 crore

t f B! P L


పాకిస్తాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ (పీఐఏ)ను ప్రభుత్వం అమ్మేసింది. ఇస్లామాబాద్ లో జరిగిన పోటీ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత జాతీయ ఎయిర్ లైన్స్ ను రూ.4,300 కోట్లకు విక్రయించింది. సంవత్సరాల తరబడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, విఫలమైన పునరుద్ధరణ ప్రణాళికల తర్వాత నష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ నుండి నిష్క్రమించడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రధాన అడుగు ఈ అమ్మకం. ఇవాళ జరిగిన ఎయిర్ లైన్స్ ప్రైవేటీకరణ కార్యక్రమంలో ముగ్గురు ముందస్తు అర్హత కలిగిన బిడ్డర్లు పాల్గొన్నారు. వీరిలో లక్కీ సిమెంట్, ప్రైవేట్ ఎయిర్‌లైన్ ఎయిర్‌బ్లూ, పెట్టుబడి సంస్థ ఆరిఫ్ హబీబ్ ఉన్నారు. అధికారిక ప్రక్రియలో భాగంగా, బిడ్డర్లలో ప్రతి ఒక్కరూ తమ సీల్డ్ బిడ్‌లను పెట్టెలో జమ చేశారు. అనంతరం ఆరిఫ్ హబీబ్ గ్రూప్ ఎయిర్ లైన్స్ ను దక్కించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉప ప్రధాని ఇషాక్ దార్ సంస్ధకు అభినందలు తెలిపారు. ఆరిఫ్ హబీబ్ 115 బిలియన్లు అంటే దాదాపు రూ.3,680 కోట్ల ప్రారంభ ఆఫర్‌తో అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. చివరికి పోటీలో ఇదే సంస్ద రూ.4,320 కోట్లవరకూ వెళ్లి ఎయిర్ లైన్స్ ను దక్కించుకుంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ