చెన్నై జిల్లా పరిధిలోని 16 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పనులు గత నెల 4వ తేదీన ప్రారంభించారు. 3,718 మంది పోలింగ్ స్టేషన్ అధికారులను నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జి, పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఈ క్రమంలో, లెక్కింపు ఫారాలు పొందే అంశంపై గురువారం స్థానిక రిప్పన్ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎంకే, ఎండీఎంకే, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం సహా 12 గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో అధికారులు మాట్లాడుతూ చెన్నై జిల్లాలోని 40.04 లక్షల ఓటర్లలో 39.59 మందికి లెక్కింపు ఫారాలు అందజేశామన్నారు. వారిలో 22.79 లక్షల మంది నుంచి ఫారాలు పొందామని తెలిపారు. వారిలో 2.23 లక్షల మంది రెండు ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే, 1.49 లక్షల మంది మృతిచెందిన జాబితాలో ఉన్నారని తెలిపారు. 8.39 లక్షల మంది శాశ్వతంగా వేరే నియోజకవర్గానికి మారారని, 36,979 మంది స్పందించలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. ఈ గణాంకాల ప్రకారం 25.99 శాతం మంది ఫారాలు అందించలేదని తెలుస్తుందని, ఈ కారణంగా 10.40ల లక్షల నుంచి 15 లక్షల మందిని ఓటర్ల జాబితాల నుంచి తొలగించే అవకాశముందని అధికారులు తెలిపారు.
చెన్నై జిల్లాలో 15 లక్షల ఓట్ల తొలగింపు ?
Saturday, December 6, 2025
15 lakh votes deleted in Chennai district? 25.99 percent of people did not submit forms BJP Congress and CPM participated in the meeting DMK MDMK national tamilnadu
No comments:
Post a Comment