ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు సముద్రంలో గల్లంతై మరణించారు. ఆదివారం సెలవు కావడంతో ఈతకు వెళ్లి విగత జీవులుగా మారిన ఈ ఘటన స్థానికంగా విషాదం మిగిలించింది. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నెల్లూరు నగరంలోని కోటమిట్ట, నారాయణరెడ్డిపేట ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు మైపాడు బీచ్‌కు చేరుకున్నారు. వీరంతా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. ఈత కోసం సముద్రంలోకి వెళ్లిన యువకులు అలల ఉధృతికి లోనై గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు అనంతరం ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను మెరైన్ పోలీసులు సముద్రం నుంచి వెలికితీశారు. పోలీసులు మృతులను ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. వీరంతా 17 సంవత్సరాల వయస్సు గల ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న యువకులు.
0 Comments