హైదరాబాద్ లో కో-లివింగ్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. వృత్తి ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే యువ నిపుణులకు, విద్యార్థులకు ఈ కో-లివింగ్ వసతులు సులభమైన నివాస మార్గాన్ని అందిస్తున్నా, కొన్నిచోట్ల ఈ వసతి గృహాలు డ్రగ్స్ అక్రమ రవాణాకు, వినియోగానికి కేంద్రాలుగా మారుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కో-లివింగ్ అనేది పాశ్చాత్య దేశాల నుంచి లేటెస్ట్ ట్రెండ్. ఇందులో ఎక్కువ మంది వ్యక్తులు ఒకే భవనంలో, ఒకే రూమ్‌లో లేదా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తారు. అద్దెను, ఇతర ఖర్చులను పంచుకోవడం వంటివి చేస్తుంటారు. సాధారణంగా దీనిలో ఇంటర్నెట్, హౌస్ కీపింగ్, కిచెన్ రూమ్ వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ఐటీ నగరాల్లో పనిచేసే యువత తక్కువ అద్దెకు, పూర్తి సౌకర్యాలతో నివసించడానికి ఈ విధానాన్ని ఎక్కువగా ఆదరిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని టీఎన్‌జీఓ కాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌పై ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న వారితో సహా మొత్తం 12 మందిని అరెస్టు చేశారు.
హైదరాబాద్ లో కో లివింగ్ రూమ్స్‌పై పోలీసుల మెరుపుదాడులు !
الأربعاء، 5 نوفمبر 2025
12 people were arrested in these raids Co-living is the latest trend from Western countries including those who were having a drug party Police raids on co-living rooms in Hyderabad telangana
ليست هناك تعليقات:
إرسال تعليق