అమెరికాలోని న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ భారీ విజయం సాధించారు. న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించారు. అది కూడా 34 ఏళ్ల వయసులో న్యూయార్క్ మేయర్ కావడం శతాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. మేయర్‌గా విజయం సాధించిన తర్వాత మద్దతుదారులను ఉద్దేశించి జోహ్రాన్ మమ్దానీ తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూను జ్ఞాపకం చేసుకుని ప్రసంగించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చిన సందర్భంగా నెహ్రూ చేసిన చారిత్రాత్మక ప్రసంగం ''ట్రిస్ట్ విత్ డిస్టనీ'' నుంచి ప్రేరణ పొందినట్లుగా మమ్దానీ తెలిపారు. శతాబ్దాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి 1947, ఆగస్టు 14న నెహ్రూ ప్రసంగించారు. ప్రసంగంలో త్యాగాలు, ఒక యుగం ముగింపు, భవిష్యత్ ప్రణాళిక గురించి ప్రస్తావించారు. తాజాగా మమ్దానీ కూడా ఇదే విషయాన్ని గుర్తుచేశారు. ''మీ ముందు నిలబడి నేను జవహర్‌లాల్ నెహ్రూ మాటలను గుర్తుచేసుకుంటున్నాను. చరిత్రలో ఒక క్షణం అరుదుగా వస్తుంది. మనం పాత నుంచి కొత్త వైపు అడుగు పెట్టినప్పుడు, ఒక యుగం ముగిసినప్పుడు, చాలా కాలంగా అణచివేయబడిన ఒక దేశం యొక్క ఆత్మ ఉద్భవిస్తోంది. ఈ రాత్రి మనం పాత నుంచి కొత్త యుగం వైపు అడుగు పెట్టాము.'' అని నెహ్రూ మాటలను మమ్దానీ గుర్తుచేశారు. ఈ విజయం న్యూయార్క్‌కు కొత్త శకానికి ప్రతీక అని, ధైర్యంగా నాయకత్వం వహించమని హామీ ఇచ్చారని మమ్దానీ పేర్కొన్నారు. ''మనం చాలా పిరికివాళ్ళమని చెప్పడానికి సాకుల జాబితా కాకుండా, మనం ఏమి సాధిస్తామో అనే ధైర్యమైన దృష్టిని న్యూయార్క్ వాసులు తమ నాయకుల నుంచి ఆశించే యుగం ఇది.'' అని జోహ్రాన్ మమ్దానీ అన్నారు.
మీ ముందు నిలబడి నేను జవహర్‌లాల్ నెహ్రూ మాటలను గుర్తుచేసుకుంటున్నాను !
الأربعاء، 5 نوفمبر 2025
I recall the words of Jawaharlal Nehru international Nehru's historic speech ''Tryst with Destiny'' Standing before you Zohran Mamdani's maiden speech
ليست هناك تعليقات:
إرسال تعليق