అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి కాలిబూడిదైన ఇన్నోవా కారు : ప్రయాణికులు సురక్షితం

السبت، 8 نوفمبر 2025

burns to ashes Criem Hyderabad-Vijayawada National Highway Innova car crashes into divider near Gundrampally in Chityala mandal of Nalgonda distric Passengers safe telangana

t f B! P L


తెలంగాణ లోని నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో గుండ్రాంపల్లి సమీపంలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం పల్టీలు కొట్టి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. ఈ ఘటనలో క్షణాల్లోనే ఇన్నోవా ఇంజిన్‌లో మంటలు చెలరేగి, మొత్తం కారు అగ్నికి ఆహుతైంది. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగి క్షణాల్లోనే మంటలు చెలరేగినా, వారు సమయస్ఫూర్తిగా స్పందించి వాహనం నుండి బయటపడ్డారు. దీనిలో కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయి, ఐరన్ ఫ్రేమ్ మాత్రమే మిగిలింది. ఇక ఇన్నోవా రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం గంటల పాటు వాహనాలు కిలోమీటర్ల మేర కదలక నిలిచిపోయాయి. చిట్యాల వరకు వాహనాల క్యూలు ఏర్పడ్డాయి. పోలీసులు, హైవే ప్యాట్రోలింగ్ బృందం సహాయంతో ప్రమాదగ్రస్త వాహనాన్ని పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేశారు. అధిక వేగం కారణంగానే ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ అలసట లేదా నిద్రమత్తు కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని చెబుతున్నారు. హైవేపై రాత్రి వేళల్లో ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక నిఘా అవసరమని ట్రాఫిక్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ