నువ్వులు - ఆరోగ్య ప్రయోజనాలు

السبت، 8 نوفمبر 2025

arogyam food Health Tips Sesame - Health Benefits Sesame seeds play a key role in preventing bone problems in women after menopause

t f B! P L


నువ్వులను ప్రతిరోజు ఒక స్పూన్ తిన్నట్లయితే శరీరానికి ఎన్నో రకాల లాభాలు చేకూరుతాయి. నువ్వులు తినడం వల్ల శరీరంలో చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో రక్తం వేగంగా పెరగడానికి నువ్వులు ఎంతగానో సహాయం చేస్తాయి. మోనోపాజ్ అనంతరం మహిళలలో ఎదురయ్యే ఎముకల సమస్యలను నివారించడానికి నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. నువ్వులు తినడం వల్ల మహిళలకు చాలా మంచిది. నువ్వులలో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. స్త్రీలలో ఉండే రక్తహీనత సమస్యలను మెరుగు పరుస్తాయి. స్త్రీల శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడానికి నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. నువ్వులు ప్రతిరోజు తినడం వల్ల చర్మానికి జుట్టుకు చాలా మంచిది. నువ్వులలో విటమిన్ ఈ, జింక్, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని, జుట్టును కాంతివంతంగా ప్రకాశవంతంగా తయారుచేస్తాయి. జుట్టు రాలడం లాంటి సమస్యలు మెరుగుపడతాయి. నువ్వులతో తయారు చేసిన నూనె జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం లాంటి సమస్యలు తొలగిపోతాయి. జుట్టు కాంతివంతంగా తయారు అవుతుంది. జుట్టు బలంగా, ఒత్తుగా, పొడవుగా మారుతుంది. నువ్వులు తినడం వల్ల చర్మం ఫిట్ గా తయారవుతుంది. నువ్వులు జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. నువ్వులలో మంచి కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. నువ్వులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఉదయం పూట ఒక చెంచాడు నువ్వులు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులను చాలా రకాల వంటకాలలో పొడి రూపంలో వేసుకొని తింటూ ఉంటారు. నువ్వులతో తయారు చేసిన లడ్డూలను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులు, బెల్లం కలుపుకొని లడ్డూల రూపంలో తయారు చేసుకొని తిన్నట్లయితే బలంగా తయారవుతారు. చిన్నపిల్లలకు కూడా నువ్వుల లడ్డూలను తినిపించడం వల్ల వారి పెరుగుదలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటారు. వారి మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ