స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్‌ భారీ నజరానా అందజేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

السبت، 8 نوفمبر 2025

Chief Minister Devendra Fadnavis and Deputy CM Ajit Pawar presented the cheques cricket Jemimah Rodrigues Maharashtra government presents huge awards to Smriti Mandhana Radha Yadav sports

t f B! P L


హారాష్ట్ర ప్రభుత్వం క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్‌ తలా రూ.2.25 కోట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్‌లను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ క్రికెటర్లకు అందజేశారు. ప్లేయర్లను చూస్తుంటే తమకు చాలా గర్వంగా ఉందని ఫడ్నవీస్‌ అన్నారు. మహారాష్ట్రకే చెందిన భారత హెడ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్‌కు కూడా ప్రభుత్వం రూ.22 లక్షల 50 వేల నగదు పురస్కారాన్ని అందించింది. టీమ్‌ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న అనిరుధ దేశ్‌పాండే, అపర్ణ గంభీర్‌రావు, మిహిర్‌ ఉపాధ్యాయ్, పూర్వ కాటే, మమత షిరురుల్లాలతో పాటు మాజీ క్రికెటర్‌ డయానా ఎడుల్జీలకు కూడా తలా రూ.11 లక్షలను సీఎం బహుమతిగా అందించారు. భారత జట్టులోని ఇతర సభ్యులు క్రాంతి గౌడ్‌ (మధ్యప్రదేశ్‌), అమన్‌జోత్‌ కౌర్, హర్లీన్‌ డియోల్‌ (పంజాబ్‌), రిచా ఘోష్‌ (బెంగాల్‌), అరుంధతి రెడ్డి (తెలంగాణ)లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికాయి. రిచా స్వస్థలం సిలిగురిలో ఓపెన్‌ టాప్‌ జీప్‌లో ఆమె విజయోత్సవ ర్యాలీని నిర్వహించగా, భోపాల్‌లో క్రాంతి గౌడ్‌ను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌... అరుంధతి రెడ్డిని తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి సత్కరించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ