వేములవాడ రాజన్న ఆలయంలో ప్రసాదం తయారీ విభాగంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆలయ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయగా, కమిటీ తన నివేదికలో 14 రకాల ప్రసాద పదార్థాలు మాయమైనట్లు తేల్చింది. ప్రస్తుతం సెంట్రల్ గోదాం సూపరింటెంట్‌గా పనిచేస్తున్న వెంకట ప్రసాద్ రాజు యాదగిరిగుట్ట నుంచి ట్రాన్స్‌ఫర్ పై వేములవాడకు వచ్చారు. అయితే, వెంకటప్రసాద్ వెనుక ఓ బడా రాజకీయ నేత ఉన్నట్లు ఆలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలు ఆరోపణలు ఉన్నప్పటికీ, వెంకటప్రసాద్ రాజుపై చర్యలు తీసుకోవడానికి ఆలయ ఉన్నతాధికారులు జంకుతున్నట్లు తెలుస్తుంది. మీడియా సంస్థలు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడంతో సూపరింటెండెంట్ మీడియాకు నోటీసులు పంపడం మరో వివాదంగా మారింది. ఈ ఘటన ఆలయ పరిపాలనపై ప్రశ్నలు రేపుతోంది.
రాజన్న ఆలయంలో ప్రసాదం తయారీ విభాగంలో భారీ అవకతవకలు
الثلاثاء، 18 نوفمبر 2025
committee concluded that 14 types of prasadam ingredients had disappeared Major irregularities in the prasadam preparation department of temple special committee was formed on this issue telangana
ليست هناك تعليقات:
إرسال تعليق