అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వసతి గదుల అద్దెలను దేవస్థాన అధికారులు పెంచారు. డిసెంబర్ 1 నుంచి పెంచిన అద్దెలు అమల్లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భక్తుల రద్దీ పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికమవడం, సౌకర్యాల మెరుగుదల వంటి కారణాల వల్ల అద్దెల పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి. హరిహర సదన్‌లో ఇప్పటికి వరకు అద్దె రోజుకు రూ.950గా ఉండగా దానిని రూ.1,500కి పెంచారు. రోజుకు రూ.600గా ఉన్న సత్రం గది అద్దెని రూ.800కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశ్ సదన్‌లో ఇప్పటి వరకు రోజుకు రూ.999గా ఉండగా దానిని రూ.1,260 వసూలు చేయనున్నారు. న్యూ సీసీసీ, ఓల్డ్ సీసీసీలో రూ.500 నుంచి రూ.700కు పెంచారు. దేవస్థానం ఆధీనంలో ఉన్న వసతి గదుల్లో శుభ్రత, బెడ్స్, బెడ్ షీట్స్, దుప్పట్లు, విద్యుత్, నీటి వసతులు ఇలాంటి సౌకర్యాలు మెరుగుపర్చడంపై ఆ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. సత్యదేవుని ఆలయం దగ్గర ఉన్న ఈ వసతి గదులను ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకునే అవకాశం ఉన్న విషయం విదితమే.
వసతి గదుల అద్దె భారీగా పెంచిన అన్నవరం దేవస్థానం
الثلاثاء، 18 نوفمبر 2025
Andhra Pradesh Annavaram Devasthanam hikes dormitory room rents high maintenance costs and improvement of facilities increased rents will come into effect from December 1
ليست هناك تعليقات:
إرسال تعليق