క్రికెట్ చరిత్రలో తొలిసారి భారత మహిళల జట్టు ఉమెన్స్ వరల్డ్ కప్ 2025ని సొంతం చేసుకోవడంతో టీమిండియా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. మంగళవారం నుండి కొన్ని బ్రాండ్లు కీలక ప్లేయర్లకు బ్రాండ్ ఎండార్స్ మెంట్ అప్పగించేందుకు పరిశీలనలు మొదలుపెట్టాయి. పెద్ద సంఖ్యలో కంపెనీలు వీరితో సంప్రదింపులు చేస్తున్నాయని సమాచారం. కొత్త ఒప్పందాలు మాత్రమే కాకుండా కాంట్రాక్ట్ ఫీజులలో 25 -30 శాతం కంటే ఎక్కువ పెంచాలని విజ్ఞప్తులకు సంబంధించిన ఒప్పందాలపై కూడా పునఃచర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా పై అద్భుతమైన పోరాటం చేసిన బ్యాటర్ జమీమా రోడ్రిక్స్ బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ లో 338 పరుగుల లక్ష్య చేదనలో 127 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచిన ఆమె ప్రదర్శన అభిమానులనే కాదు, వ్యాపార కంపెనీలను సైతం ఆకర్షించింది. ఈ వరల్డ్ కప్ జమీమా జీవితాన్నే మార్చివేసింది. జమీమా రోడ్రిక్స్ బ్రాండ్ వ్యాల్యూ 100% పెరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జమీమా బ్రాండ్ ను నిర్వహించే స్పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ మాట్లాడుతూ “ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత మాకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్ లు వచ్చాయి. మేము 10 – 12 విభాగాలలోని బ్రాండ్లతో సంభాషణ జరుపుతున్నాము” అని చెప్పుకొచ్చారు. నివేదికల ప్రకారం జమీమా ఇప్పుడు బ్రాండ్ల లాంగివిటి, డెలివరీలను బట్టి రూ.75 లక్షల నుండి రూ. 1.5 కోట్ల వరకు ఫీజులు వసూలు చేస్తుందని సమాచారం. దేశంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్స్ స్మృతి మందాన రెక్సోనా, డియోడరెండ్, నైక్, హ్యుందాయ్, హెర్బాలైఫ్, ఎస్బిఐ, గల్ఫ్ ఆయిల్, పిఎన్బి సహా 16 బ్రాండ్లకు ఎండార్స్ మెంట్ చేస్తోంది. ఇప్పుడు పలు కంపెనీలు జెమిమా భాగస్వామ్యం కోసం పోటీ పడుతున్నాయి. ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై గెలవడంతో భారత మహిళా క్రికెటర్లకు అపూర్వమైన గౌరవం ఏర్పడింది. చాలామంది క్రికెటర్ల సోషల్ మీడియా ఖాతాలకు ఈ రెండు రోజుల్లో ఫాలోవర్లు భారీగా పెరిగిపోయారు. ముఖ్యంగా జమీమాకి ఫాలోవర్లు భారీగా పెరిగారు. ఆస్ట్రేలియాపై సెంచరీ తో అజేయంగా నిలిచి భారత జట్టుని ఫైనల్ లోకి తీసుకువెళ్లిన ఈ యువ కెరటం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుంది. భారత్ లో క్రికెట్ కేంద్రంగా ఉన్న ముంబై నుండి క్రికెటర్ గా ఎదిగిన జమీమా.. సొంత గడ్డపై సాధించిన సెంచరీ ఆమెను మేటి క్రికెట్ క్రీడాకారిణుల జాబితాలో నిలబెట్టింది.
భారీగా పెరిగిన టీమిండియా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ !
الأربعاء، 5 نوفمبر 2025
Brand value of Team India cricketers has increased drastically cricket national some brands have started considering giving brand endorsements to key players sports
ليست هناك تعليقات:
إرسال تعليق