రాజస్థాన్‌లో పోలీసుల భారీ బందోబస్తుతో గుర్రంపై పెళ్లి ఊరేగింపు !

الاثنين، 3 نوفمبر 2025

national Rajasthan some villagers were trying to prevent him from riding on horseback Wedding procession on horseback with heavy police security

t f B! P L


రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ రాజీవ్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయాపురా చౌకాలో ఉండే బాబా రామ్‌దేవ్ కాలనీలో ఆదివారం రోజున ఓ పెళ్లి ఊరేగింపు జరిగింది. వరుడు గుర్రంపై కూర్చుని వెళ్తుంటే పోలీసులు బందోబస్తుగా గట్టి రక్షణ కల్పించారు. అది కూడా డీపీఎస్ బైపాస్‌లోని రిసార్ట్ వరకు ఈ పెళ్లి వేడుక ఊరేగింపు భారీ పోలీసుల భద్రత మధ్య జరిగింది. విషయం ఏంటంటే ఓ కాలనీలో ఉండే విక్రమ్ మేఘ్వాల్ పెళ్లి నిన్న ఆదివారం జరిగింది. గుర్రంపై కూర్చోవడాన్ని అడ్డుకునేందుకు కొంతమంది గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉందని భయపడుతున్నట్లు పెళ్ళికి ముందు మధ్యాహ్నం 12 గంటలకు పెళ్ళికొడుకు అన్నయ్య నరేంద్ర పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ విషయాన్ని పోలీస్ కమిషనర్ కి తెలియజేశారు. దింతో ఆయన ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వరుడి ఇంటికి చేరుకున్నారు. గట్టి పోలీసు రక్షణ మధ్య గుర్రంపై కూర్చోగా పెళ్లి ఊరేగింపు భారీ భద్రత మధ్య మొదలైంది. ఈ ఊరేగింపు చుట్టూ కూడా పోలీసులు పహారా వేశారు. ఈ భద్రత మధ్య వరుడి ఊరేగింపు చివరికి పెళ్లి ప్రదేశమైన ఓ రిసార్ట్‌కు చేరుకుంది. దీంతో వరుడి కుటుంబీకులు, బంధువులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ