తెలంగాణలోని ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ (30) అదే గ్రామానికి చెందిన మోటపోతుల అఖిలకు మూడేళ్ల క్రితం పెళ్లి అయింది. పెళ్లైన రెండేళ్ల తరువాత భార్య భర్తలకు మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి అఖిల తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఏడాది కాలంగా భార్య రాకపోవడంతో భర్త మహేష్ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశాడు. పలుమార్లు నోటీసులు పంపినా అఖిల కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. విషయం తెలుసుకున్న అఖిల తల్లిదండ్రులు ముత్తగూడెం గ్రామ పెద్దల సహకారంతో భార్యాభర్తలను ఇద్దరినీ ఒక్కటి చేశారు. కొద్ది రోజులు భర్త దగ్గర ఉన్న అఖిల మళ్ళీ తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అఖిల తండ్రి వెంకన్న, సోదరుడు మనోజ్, మనోజ్ బావమరిది యల్ది వెంకన్నలు అఖిలకు సర్ది చెప్పి మహేష్ ఇంటికి తీసుకువచ్చారు. అఖిలను ఇంట్లోకి తీసుకెళ్లి భార్యగా స్వీకరించాలని మహేష్ ను కోరగా ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. నా బిడ్డను రానివ్వకుండా నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తా అని అఖిల తండ్రి మోటపోతుల వెంకన్నఅఖిలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అనంతరం వెంకన్న కొడుకు మనోజ్ తో పాటు అతని బావమరిది యల్ది వెంకన్నను తీసుకొని వచ్చి మహేష్ ఇంటిపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో మహేష్ శరీరంపై కత్తి పోట్లు పడగా, అడ్డొచ్చిన మహేష్ తల్లి నాగమణి (50)ని సైతం కత్తులతో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన మహేష్ ను ఖమ్మం సిటీ లోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులు ముగ్గురు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అల్లుడు ఇంటిపై కత్తులతో దాడి చేసిన మామ : ఆసుపత్రి పాలైన అల్లుడు, తల్లి మృతి
الاثنين، 3 نوفمبر 2025
Criem Khammam Rural mandal mother dead Mother-in-law attacked son-in-law's house with knives Muthagudem village Son-in-law hospitalized
ليست هناك تعليقات:
إرسال تعليق