అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలలో ట్రంప్‌కు ఓటర్లు ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లో ట్రంప్ ఫొటో లేదు. అమెరికాలో షట్‌డౌన్ ఉంది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ఇవే రెండు ముఖ్య కారణాలు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. వర్జీనియాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. రిపబ్లికన్ పార్టీ సీయర్స్ ఓటమి పాలవ్వగా.. డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్నాన్‌బర్గర్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్ కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. అబిగైల్ 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో మొదటి మహిళా గవర్నర్ గా అబిగైల్ చరిత్ర సృష్టించారు. సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్ కూడా ఓడిపోయారు. ఈయనపై డెమొక్రాట్ అఫ్తాబ్ పురేవాల్ గెలుపొందారు. పురేవాల్ రెండవ సారి మేయర్ గా ఎన్నికయ్యారు. తొలిసారి 2021లో మేయర్‌గా ఎన్నికయ్యారు. మే నెలలో జరిగిన ఆల్ పార్టీ మున్సిపల్ ప్రైమరీలో ఆయన 80% కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు.
అమెరికా స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులు ఓటమి : ట్రంప్‌కు ఓటర్లు ఝలక్
الأربعاء، 5 نوفمبر 2025
international no Trump photo on the election ballot paper Republican candidates lose in US local elections social media platform Truth There is a shutdown in America Voters give Trump a boost
ليست هناك تعليقات:
إرسال تعليق