రతన్ టాటాకు సన్నిహితుడిగా, వ్యాపారవేత్తగా పేరుపొందిన మెహ్లీ మిస్త్రీ, టాటా ట్రస్టుల నుండి తన ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సీఎన్‌బీసీ-టీవీ18 పేర్కొన్న వివరాల ప్రకారం, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాతో పాటు అన్ని ట్రస్టీలకు రాసిన లేఖలో మిస్త్రీ, సంస్థను వివాదాల నుండి దూరంగా ఉంచాలని.. దాని వ్యవస్థాపక విలువలను, రతన్ టాటా దార్శనికతను నిలబెట్టుకోవాలననొక్కి చెప్పారు. తను రాసిన లేఖలో రతన్ ఎన్. టాటా దార్శనికతకు నా నిబద్ధతలో, టాటా ట్రస్టులు వివాదాల్లో చిక్కుకోకుండా ఉండటం అత్యవసరం. వేగంగా తీసుకునే నిర్ణయాలు లేదా అంతర్గత విభేదాలు సంస్థ ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగించవచ్చు. ఎల్లప్పుడూ ప్రజా ప్రయోజనాలను ముందుంచే రతన్ టాటా స్ఫూర్తితో, భవిష్యత్తులో ట్రస్టీలు పారదర్శకత, సుపరిపాలన, ప్రజా ప్రయోజనాల సూత్రాలపై నడవాలని ఆశిస్తున్నాను. ఇది సేవలందించే సంస్థ కంటే ఎవరూ గొప్పవారు కాదు' అని ఆయన చెప్పిన మాటలతో నేను విడిపోతున్నాను అని తెలిపారు. మిస్త్రీ పదవీకాలం 2024 అక్టోబర్ 27న ముగిసింది. అంతకుముందు ముందు అక్టోబర్ 17న జరిగిన ట్రస్టీల బోర్డు సమావేశంలో ఆయనను జీవితకాల ట్రస్టీగా తిరిగి నియమించాలనే తీర్మానం ఆమోదించబడినప్పటికీ, ముగ్గురు ట్రస్టీలు ఆమోదం తెలపకపోవడంతో ఆ నిర్ణయం నిలిచిపోయింది. రాజీనామాకు ముందు మిస్త్రీ మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ కు కూడా లిఖితపూర్వకంగా అభ్యర్థిస్తూ, ట్రస్టీల జాబితాలో మార్పులు చేయడానికి ముందు విచారణ జరపాలని కోరారు. టాటా ట్రస్ట్స్‌లో నోయెల్ టాటా, మెహ్లీ మిస్త్రీ రెండు ప్రధాన శక్తి కేంద్రాలుగా పరిగణించబడ్డారు. నోయెల్ టాటా వర్గానికి టీవీఎస్ మోటార్ చైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్, మాజీ రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్ మద్దతు ఉన్నప్పుడు, మిస్త్రీ వర్గానికి సిటీబ్యాంక్ ఇండియా మాజీ సీఈఓ ప్రమిత్ ఝవేరి, న్యాయవాది డారియస్ ఖంబాటా, జెహంగీర్ హెచ్‌సీ జెహంగీర్ మద్దతుగా ఉన్నారు. సెప్టెంబర్‌లో టాటా సన్స్ బోర్డులో విజయ్ సింగ్‌ను ట్రస్టుల ప్రతినిధిగా తొలగించాలని మిస్త్రీ వర్గం ఓటు వేయడంతో, రెండు శిబిరాల మధ్య అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. అక్టోబర్ 17, 2024న జరిగిన సంయుక్త సమావేశం ప్రకారం, ట్రస్టీలను దీర్ఘకాలిక లేదా జీవితకాల ప్రాతిపదికన నియమించాలని నిర్ణయించారు. అయితే 75 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు వారి పాత్రను పునఃపరిశీలించాలని స్పష్టం చేశారు. ఈ తీర్మానంపై రెండు వర్గాలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఒక వర్గం తిరిగి నియామకం స్వయంచాలకంగా జరగాలి అని భావించగా, మరో వర్గం ఏకగ్రీవ ఆమోదం అవసరం అని పట్టుబట్టింది. టాటా ట్రస్ట్స్ సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ తదితర సేవా సంస్థలను పర్యవేక్షిస్తుంది. ఇది 156 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగి ఉంది, దీని కింద దాదాపు 400 కంపెనీలు, అందులో 30 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి.
టాటా ట్రస్టీ పదవికి రాజీనామా చేసిన మెహ్లీ మిస్త్రీ
الأربعاء، 5 نوفمبر 2025
'" he said "I am leaving with the words 'This is a service organization business Mehli Mistry resigns as Tata Trustee national no one is greater than the organization it serves
ليست هناك تعليقات:
إرسال تعليق