ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, పెదకాకానిలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆస్పత్రి నూతన భవనాన్ని, అందులోని సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రి ప్రాంగణాన్ని పూర్తిగా సందర్శించి, ఆస్పత్రిలోని అన్ని విభాగాల గురించి, నూతనంగా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రం యొక్క ప్రత్యేకతల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు, అత్యాధునిక పరికరాల గురించి నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరంగా వివరించారు. అనంతరం, శంకర ఐ ఫౌండేషన్ ద్వారా ఆస్పత్రి అందిస్తున్న సేవలను గురించి కూడా నిర్వాహకులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ముఖ్యంగా ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సర్జరీలు, ఐ బ్యాంక్ ద్వారా జరుగుతున్న సేవలు, ప్రజలకు ఉచితంగా అందుతున్న వైద్య సహాయం వంటి వివరాలను సీఎంకు వివరించారు. ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించడంలో ఈ నూతన కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు.
ホーム
/
run by Sri Kanchi Kamakoti Peethadhipathi Jagadguru Sri Sri Sri Shankara Vijayendra Saraswati Swamiji
/
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రం ప్రారంభం
الأحد، 9 نوفمبر 2025
Andhra Pradesh CM Chandrababu Naidu inaugurated the super specialty eye care center run by Sri Kanchi Kamakoti Peethadhipathi Jagadguru Sri Sri Sri Shankara Vijayendra Saraswati Swamiji
ليست هناك تعليقات:
إرسال تعليق