ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ 15న వేలం నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ 15లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుందని సమాచారం. గతంలో రెండు సీజన్ల మాదిరిగానే ఈ సారి కూడా గల్ఫ్ దేశాల్లోనే ఐపీఎల్ వేలం నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఫ్రాంచైజీలకు కూడా తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సారి ఐపీఎల్ ఆక్షన్ భారత్‌లోనే ఉంటుందని తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఏ నగరంలో వేలం నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. గత రెండు ఆక్షన్‌లను వేరే దేశంలో నిర్వహించారు. 2023లో దుబాయ్, 2024లో సౌదీ అరేబియాలో వేలం ప్రక్రియ జరిపారు. ఐపీఎల్ 2026 వేలం ప్రక్రియ గురించి బీసీసీఐ(BCCI) నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం నవంబర్ 27న ఢిల్లీలో మెగా వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే టోర్నీలోని ఐదు జట్లు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 13, గుజరాత్ జెయింట్స్‌లో 16, ముంబై ఇండియన్స్‌లో 13, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 14, యూపీ వారియర్స్‌లో 17 ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా యూపీ ఫ్రాంచైజీ పర్స్‌లో రూ.14.5కోట్లు ఉన్నాయి.
డిసెంబర్ 15న ఐపీఎల్ 2026 వేలం ?
الأحد، 9 نوفمبر 2025
cricket IPL 2026 auction on December 15? like the previous two seasons national sports There was a campaign that the IPL auction will be held in the Gulf countries this time
ليست هناك تعليقات:
إرسال تعليق