ఒప్పో నుంచి సరికొత్త ఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్‌ విడుదల

الجمعة، 21 نوفمبر 2025

depending on the variant Oppo launches new Find X9 series Sales have started from today science smart phones technology the price starts from Rs. 74999

t f B! P L


దేశీయ మార్కెట్లో ఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్‌ని ఒప్పో ఇండియా విడుదల చేసింది. వేరియంట్‌ని బట్టి ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయి. హాసెల్‌బ్లాడ్‌తో కలిసి రూపొందించిన కొత్త తరం కెమెరా సిస్టం, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, శక్తివంతమైన పనితీరు మొదలైన విశేషాలు ఇందులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే హాసెల్‌బ్లాడ్‌ టెలీకన్వర్టర్‌ కిట్‌ రూ. 29,999కి లభిస్తుంది. ఇక, లేటెస్ట్‌ టీడబ్ల్యూఎస్‌ ఎన్‌కో బడ్స్‌3 ప్రోప్లస్‌ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1,899గా ఉంటుంది. ఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ హాసెల్‌బ్లాడ్‌తో కలిసి అభివృద్ధి చేసిన నెక్స్ట్‌ జెన్‌ కెమెరా సిస్టమ్. ఇది ప్రొఫెషనల్‌ ఫోటోగ్రఫీ అనుభవానికి దగ్గరగా ఉండే రంగులు, కాంట్రాస్ట్‌, డైనమిక్‌ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకంగా టెలిఫోటో ఫోటోగ్రఫీ కోసం హాసెల్‌బ్లాడ్‌ టెలీకన్వర్టర్‌ కిట్ కూడా పరిచయమైంది. ఫైండ్‌ ఎక్స్‌9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో బలమైన ప్రాసెసర్‌, ఆప్టిమైజ్డ్‌ సాఫ్ట్‌వేర్‌, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ వంటి అంశాలు ఉన్నాయి. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ, నిరంతర మల్టీ టాస్కింగ్‌ సామర్థ్యం, హై-ఎండ్‌ గేమింగ్‌కు సరిపడే పనితీరు ఈ డివైస్‌లను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ