ర్యాపిడో డ్రైవర్ గురించి కోమల్ పోర్వాల్ అనే కాపీ రైటర్ లింక్డ్ ఇన్ లో ఇలా రాసింది. ఆమె రాత్రి 9 గంటల సమయంలో ర్యాపిడో రైడ్ తీసుకుందట. దారిలో వెళ్తూ రాపిడో డ్రైవర్‌తో సరదాగా మాటలు కలిపింది. డ్రైవర్ చాలా ఉల్లాసంగా, చురుకైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడని కోమల్ చెప్తోంది. అయితే మాటల్లో మాటగా కోమల్ అతన్ని "మీరు రోజంతా ఇదే పని చేస్తారా?" అని అడిగింది. దానికి ఆ డ్రైవర్ నవ్వుతూ చెప్పిన సమాధానానికి కోమల్ ఆశ్చర్యపోయింది. అతడు ఉదయం స్విగ్గీ డెలివరీ బాయ్ గా పని చేస్తాడట. ఆ తర్వాత ర్యాపిడో డ్రైవర్ గా పని చేస్తాడట. వీకెండ్స్ లో తన సోదరుడితో కలిసి పానీ పూరీ స్టాల్ నడుపుతాడట. ఇలా చెప్పి "మేడమ్, కొంచెం కష్టంగానే ఉంది. కానీ మా ఇల్లు మాత్రం చాలా సంతోషంగా నడుస్తోంది" అని అన్నాడట. ఇంతకీ అతనికి ఎంత సంపాదన వస్తుందని కోమల్ అడగగా అతను ఈ మూడు పనులు కలిపి నెలకు దాదాపు రూ.1 లక్ష సంపాదిస్తున్నానని చెప్పడంతో కోమల్ షాకైంది. "ఈ రోజుల్లో ఎవరూ అంతగా కష్టపడటం లేదు" అనే అపోహను ఈ డ్రైవర్ పటాపంచలు చేశాడని కోమల్ తన పోస్ట్‌లో రాసింది. కోమల్ ఈ పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. కొద్ది సేపట్లోనే వేలల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఒక నెటిజన్ "నిజమే, మన కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తేనే మనం ఎన్నో అద్భుతమైన కథనాలను, వ్యక్తులను చూస్తాం" అని రాశారు. మరొకరు "సంతోషంగా, పాజిటివ్‌గా ఉండే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. అదే డబ్బు వెనుక పరుగెత్తే వాళ్ళు ఒత్తిడికి లోనై, ఆరోగ్యంగా ఉండలేక ఇబ్బంది పడతారు"అని పోస్ట్ చేశాడు. ఇక మరో నెటిజన్ "విలువైన కష్టం అంటే ఇదే. నేను ఒకసారి క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడబోతే అతను మాట్లాడలేదు. ఎందుకు అని అడిగితే, తను మాట్లాడినందుకు ఓలా కంపెనీ నుంచి వార్నింగ్ వచ్చిందంట!" అని రాశారు.
ఉదయం స్విగ్గీ డెలివరీ బాయ్, తర్వాత ర్యాపిడో డ్రైవర్, వీకెండ్స్ లో తన సోదరుడితో కలిసి పానీ పూరీ స్టాల్ : సంపాదన నెలకు రూ.1 లక్ష : లింక్డ్ ఇన్ లో వైరల్
الجمعة، 21 نوفمبر 2025
runs a pani puri stall with his brother on weekends: Earns Rs. 1 lakh per month: Viral on LinkedIn Swiggy delivery boy in the morning then Rapido driver
ليست هناك تعليقات:
إرسال تعليق