ప్రపంచంలో టాప్ 100 నగరాల్లో హైదరాబాద్‌కు 82వ స్థానం

الخميس، 27 نوفمبر 2025

'World's Best Cities' report Hyderabad ranks 82nd in the world's top 100 cities national Resonance Consultancy and Ipsos Market Research Company jointly examined 276 cities in the world telangana

t f B! P L


ప్రపంచంలోని ఉత్తమ వంద నగరాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరానికి 82వ స్థానం దక్కింది. రెసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్సోస్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కలిపి 'వరల్డ్ బెస్ట్ సిటీస్' రిపోర్టులో భాగంగా మొత్తం ప్రపంచంలోని 276 నగరాలను పరిశీలించారు. వాటికి 100 ఉత్తమ నగరాలుగా ర్యాంకింగ్ ఇచ్చారు. లండన్ వరుసగా 11వ సారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో న్యూయార్క్, మూడో స్థానంలో ప్యారిస్, నాల్గో స్థానంలో టోక్యో, ఐదో స్థానంలో మాడ్రిడ్, ఆరో స్థానంలో సింపూర్, ఏడో స్థానంలో రోమ్, ఎనిమిదో స్థానంలో బెర్లిన్ నిలిచాయి. మన దేశానికి చెందిన నాలుగు నగరాలు 100 ఉత్తమ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు 29వ స్థానంను దక్కించుకోగా, ముంబై 40, ఢిల్లీ 54వ స్థానం, హైదరాబాద్ 82వ స్థానం లభించింది. దీంతోపాటు హైదరాబాద్ కు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. టాప్ 100 టేస్టీ నగరాల జాబితాలోనూ హైదరాబాద్ నగరానికి చోటు దక్కింది. ఆ జాబితాలో 50వ స్థానంలో నిలిచింది. దేశంలో బెంగళూరు టాప్ లో నిలిచింది. టెక్ ఎకోసిస్టం, విస్తరించిన కార్పొరేట్ బేస్ వల్ల బెంగళూరు 29వ స్థానాన్ని సాధించింది. ఉద్యోగాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఇన్నొవేషన్ కేంద్రంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై 40వ స్థానంలో నిలిచింది. రాజకీయ ప్రభావం, రవాణా కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా ఢిల్లీ 54వ స్థానంలో నిలిచింది. ఇక టెక్నాలజీ విస్తరణ, ఐటీ సేవల కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్ 82వ స్థానంలో సాధించింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ